Logo
Download our app
కొంద‌రు తాను చ‌నిపోవాల‌ని కోరుకుంటున్నారు
NEWS   May 01,2025 09:19 am
జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది నేతలు తాను చనిపోవాలని కోరుకుంటున్నారని అన్నారు. బై ఎలక్షన్స్ వస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఇన్నేళ్ల ప్రజా జీవితంలో తాను ఎవరినీ ఇబ్బంది పెట్టలేద‌న్నారు. కొంతమంది అధికారులు కూడా త‌న‌ను బెదిరిస్తున్నారంటూ వాపోయారు. తాను ఎమ్మెల్యేన‌న్న విష‌యం మ‌రిచి పోయి ప్ర‌వ‌ర్తిస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు. ఎవ‌రి బెదిరింపుల‌కు భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తి లేద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source