Logo
Download our app
అంగ‌న్వాడీ చిన్నారుల‌కు వేసవి సెల‌వులు
NEWS   Apr 30,2025 05:00 pm
తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఎండలు మండుతున్న నేప‌థ్యంలో నెల రోజుల పాటు అంగ‌న్వాడీ కేంద్రాల‌కు సెల‌వులు ప్ర‌క‌టించింది. మంత్రి దాస‌రి సీత‌క్క ఆదేశాల‌తో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పేర్కొంది. మే 1 నుంచి సెల‌వులు వ‌ర్తిస్తాయ‌ని తెలిపింది. అంగ‌న్వాడీ చిన్నారులు, గ‌ర్భిణులు, బాలింత‌ల‌కు..ఇంటి దగ్గరికే గుడ్లు, స‌రుకులు స‌ర‌ఫ‌రా చేస్తార‌ని వెల్ల‌డించింది. సెల‌వు రోజుల్లో అంగ‌న్వాడీలకు ఇత‌ర విధులు అప్పగిస్తామ‌ని తెలిపింది.
⚠️ You are not allowed to copy content or view source