Logo
Download our app
72 గంట‌ల్లో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలి
NEWS   Apr 30,2025 04:38 pm
సింహాచలం ఘటనపై ఉండవల్లిలోని నివాసంలో సీఎం చంద్రబాబు సమీక్ష చేప‌ట్టారు. డీజీపీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఘటన జరిగిన తీరు, బాధితులకు అందుతున్న సాయంపై అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై విచారణకు ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ కమిటీలో పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్, ఈగల్ చీఫ్ ఆకె రవికృష్ణ, ఇరిగేషన్ శాఖ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్‌ వెంకటేశ్వరరావును సభ్యులుగా ఏర్పాటు చేశారు. 72 గంటల్లో ప్రాథమిక నివేదిక అందజేయాలని కమిటీని ఆదేశించారు. అధికారుల నిర్లక్ష్యం అని తేలితే చర్యలు తప్పవ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source