Logo
Download our app
నన్నెందుకు హౌజ్ అరెస్ట్ చేశారో చెప్పాలి
NEWS   Apr 30,2025 04:22 pm
త‌న‌ను ఎందుకు అరెస్ట్ చేశారో ఏపీ కూట‌మి స‌ర్కార్ చెప్పాల‌ని డిమాండ్ చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఒక పార్టీ అధ్యక్షురాలి మీద ఈ జులుం ఏంటి అంటూ మండిప‌డ్డారు. దీనిపై సీఎం చంద్ర‌బాబు, హోం మంత్రి అనిత స‌మాధానం చెప్పాల‌న్నారు. ఏపీకి అమ‌రావ‌తి రాజ‌ధాని అని, దానిని తాను చూడాల‌ని అనుకోవ‌డం త‌ప్పు ఎలా అవుతుందంటూ ప్ర‌శ్నించారు. కేపిట‌ల్ సిటీ మీద రీసెర్చ్ చేయాల‌ని అనుకుంటే మీకు ఎందుకు అంత భ‌యం అని ఫైర్ అయ్యారు . రాజ‌ధానిపై క‌మిటీని త‌మ పార్టీ వేసింద‌న్నారు. క‌మిటీ త‌ర‌పున విజిట్ చేయాల‌ని అనుకున్నామ‌ని, అంత‌లోపే త‌న‌ను గృహ నిర్భంధం విధించ‌డం పిరికిపంద చర్య‌గా అభివ‌ర్ణించారు.
⚠️ You are not allowed to copy content or view source