Logo
Download our app
ఏపీ హజ్ కమిటీ చేర్మన్ గా షేక్ హసన్ బాషా
NEWS   Apr 30,2025 04:12 pm
ఏపీ హ‌జ్ క‌మిటీ చైర్మ‌న్ గా షేక్ హ‌స‌న్ బాషా ఎన్నిక‌య్యారు. విజ‌య‌వాడ‌లోని హ‌జ్ క‌మిటీ హాల్ లో ఎల‌క్ష‌న్ ఆఫీస‌ర్ , మైనార్టీ సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్ర‌ట‌రీ ఎల్ సుధాక‌ర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగింది. మొత్తం 13 మంది సభ్యులలో 10 మంది సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. మొదట హ‌జ్ క‌మిటీ స‌భ్యుడు పఠాన్ ఖాదర్ అలీ ఖాన్ షేక్ హసన్ బాషాను చైర్మ‌న్ అభ్య‌ర్థిగా ప్ర‌తిపాదించారు. మ‌రో స‌భ్యుడు మీర్జా ఆబిద్ హుస్సేన్ బేగ్ బ‌ల‌ప‌ర్చారు. దీనికి మ‌ద్ద‌తుగా ఇత‌ర స‌భ్యులంతా త‌మ ఆమోదాన్ని తెలిపారు. ఈ సంద‌ర్బంగా హ‌స‌న్ భాషా చైర్మ‌న్ గా ఎన్నికైన‌ట్లు ఎన్నిక‌ల అధికారి ప్ర‌క‌టించారు.
⚠️ You are not allowed to copy content or view source