Logo
Download our app
సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో విషాదం
NEWS   Apr 30,2025 08:55 am
విశాఖపట్నం జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి దేవస్థానంలో చందనోత్సవం సందర్భంగా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భక్తుల రద్దీ మధ్య రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఒక సిమెంట్ గోడ కూలి పోవడంతో ఎనిమిది మంది భక్తులు మృతిచెందారు.స్వామివారి నిజరూప దర్శనానికి విచ్చేసిన భక్తులపై గోడ కూలింది. ఇప్పటివరకు ఆరు మృతదేహాలు వెలికి తీయగా, శిథిలాల కింద మరో రెండు మృతదేహాలు ఉన్నట్లు సమాచారం.ప్రమాద స్థలానికి వెంటనే చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అధికారులు సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు.
⚠️ You are not allowed to copy content or view source