అందాల పోటీలకు ఏర్పాట్లు చేయాలి
NEWS Apr 30,2025 06:01 am
హైదరాబాద్ లో నిర్వహించబోయే ప్రపంచ అందాల పోటీలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంలో తన అధ్యక్షతన సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. వచ్చే ప్రముఖులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దీనిని తీసుకుని నిర్వహిస్తోందన్నారు.