Logo
Download our app
ఆర్థిక మోసాలు స‌రే సీఎస్ ఎంపిక ఎలా..?
NEWS   Apr 29,2025 06:29 pm
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో ఆర్థిక నేరాల‌కు పాల్ప‌డిందంటూ ఆరోప‌ణ‌లు చేశార‌ని, మ‌రి ఎందుకు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా రామ‌కృష్ణా రావును నియ‌మించారంటూ ప్ర‌శ్నించారు. అబ‌ద్దాలు చెప్ప‌డం, మాయ మాట‌ల‌తో మోసం చేయ‌డం ప‌నిగా పెట్టుకున్నారంటూ మండిప‌డ్డారు. బీఆర్ఎస్ పై, కేసీఆర్ పై ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని నిల‌దీశారు. ఆర్థికంగా దివాళా తీశారంటూ ఆరోపించిన సీఎం ఇప్పుడు సిగ్గు లేకుండా ఎలా సీఎస్ గా నియ‌మిస్తారంటూ ఫైర్ అయ్యారు.
⚠️ You are not allowed to copy content or view source