Logo
Download our app
వీడు మ‌గాడ్రా బుజ్జీ
NEWS   Apr 29,2025 03:35 am
ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో అద్భుతం చోటు చేసుకుంది. కేవ‌లం 14 ఏళ్ల వ‌య‌సు క‌లిగిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు చెందిన వైభ‌వ్ సూర్య‌వంశీ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. రాజ‌స్థాన్ లోని స‌వాయి మాన్ సింగ్ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో శుభ్ మ‌న్ గిల్ సార‌థ్యంలోని గుజ‌రాత్ టైటాన్స్ కు చుక్క‌లు చూపించాడు. మైదానం చుట్టూ క‌ళ్లు చెదిరే షాట్స్ తో హోరెత్తించాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డ్డాడు. 206 ప‌రుగుల ల‌క్ష్యాన్ని అల‌వోక‌గా రాజ‌స్థాన్ ఛేధించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. కేవ‌లం 35 బంతులు ఎదుర్కొన్న వైభ‌వ్ 7 ఫోర్లు 11 సిక్స‌ర్ల‌తో సెంచరీ సాధించాడు. 101 ర‌న్స్ కు పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాడు.
⚠️ You are not allowed to copy content or view source