Logo
Download our app
పెహ‌ల్గామ్ దాడికి పాల్ప‌డింది వీరే
NEWS   Apr 29,2025 08:10 am
జ‌మ్మూ కాశ్మీర్ లోని అనంత‌నాగ్ జిల్లా పహ‌ల్గామ్ ఉగ్ర దాడి ఘ‌ట‌న‌లో పాల్గొన్న తీవ్ర‌వాదుల ఆచూకీ ల‌భ్య‌మైంది. ప‌ర్యాట‌కుల‌పై విచ‌క్ష‌ణా ర‌హితంగా కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో 26 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా ప‌లువురు గాయ‌ప‌డ్డారు. చెట్టుపై నుండి అహ్మదాబాద్ కు చెందిన‌ ఒక‌రు వీడియోను తీశాడు. ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. భార‌తీయ ఇంటెలిజెన్స్ మొత్తం ఈ ఘ‌ట‌న వెనుక 15 మంది ఉన్నారంటూ ప్ర‌క‌టించింది. ఈ ఉగ్ర మూకల‌కు స్థానికంగా ఉన్న కొంద‌రు కాశ్మీరీలు స‌హ‌క‌రించార‌ని స్ప‌ష్టం చేసింది. ప్ర‌స్తుతం భార‌త్, పాకిస్తాన్ స‌రిహ‌ద్దుల వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొంది.
⚠️ You are not allowed to copy content or view source