అమరావతి పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి
NEWS Apr 28,2025 06:12 pm
దేశం గర్వించేలా అమరావతి రాజధానిని పునర్ నిర్మిస్తామని ప్రకటించారు మంత్రి వంగలపూడి అనిత. రాజధాని కావాలనేది ప్రతి ఒక్కరి కల అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్దఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల అంశం తీసుకొచ్చి ప్రజల మనోభావాలు దెబ్బ తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని మోదీ రాబోతుండడం శుభ పరిణామమని అన్నారు. రాజధాని పునర్నిర్మాణంలో రాష్ట్ర ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.