Logo
Download our app
కేటీఆర్‌కు హైకోర్టులో ఊర‌ట
NEWS   Apr 28,2025 06:04 pm
మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ రిలీఫ్ ల‌భించింది. బంజారాహిల్స్‌ పీఎస్‌లో త‌న‌పై నమోదైన కేసును కొట్టేసింది హైకోర్టు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు న‌మోదు చేశారు పోలీసులు. ఢిల్లీకి రూ.2500 కోట్లను పంపించారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత శ్రీ‌నివాస్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసును కొట్టేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇరువైపుల వాదనలు విని కేసును కొట్టేస్తున్న‌ట్లు తీర్పు చెప్పారు హైకోర్టు న్యాయ‌మూర్తి ల‌క్ష్మ‌ణ్.
⚠️ You are not allowed to copy content or view source