ఎంసీహెచ్ఎస్ఆర్డీ వైస్ చైర్మన్ గా శాంతి కుమారి
NEWS Apr 28,2025 04:51 pm
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 30న పదవీ విరమణ చేయనున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి కీలకమైన పదవి అప్పగించింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCHRD) వైస్ చైర్మన్ గా నియమించింది.రెండు రోజుల్లో పదవీ విరమణ చేసిన వెంటనే పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూములలో చెట్లు కొట్టేయడం పట్ల సీఎస్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది.