Logo
Download our app
ఫిషింగ్ హార్బ‌ర్ లో మెరైన్ పోలీస్ స్టేష‌న్ ఏర్పాటు
NEWS   Apr 28,2025 04:41 pm
మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ లో మెరైన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామ‌ని అన్నారు హోం మంత్రి వంగలపూడి అనిత. అసంపూర్తిగా ఉన్న మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ పనులు చకచకా సాగుతున్న‌ట్లు చెప్పారు. ఏపీలో శాంతి భద్రతల సమస్యే లేలే లేద‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 మెరైన్ పోలీస్ స్టేషన్‌లు ఉన్నాయని వెల్ల‌డించారు. ఒక్క కృష్ణా జిల్లాలోనే 3 మెరైన్ పీఎస్ లు ఉన్నాయని తెలిపారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అడుగడుగునా వైఫల్యం క‌నిపించింద‌న్నారు. ఫిషింగ్ హార్బర్ లో బోట్లు నడవని పరిస్థితి నెల‌కొంద‌న్నారు. ఏపీలో కూట‌మి స‌ర్కార్ వ‌చ్చాక సీన్ మారింద‌న్నారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేలా రక్షణ చర్యలు చేపడతామ‌ని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source