Logo
Download our app
రోడ్డు ప్ర‌మాదం సీఎం విచారం
NEWS   Apr 28,2025 04:34 pm
తిరుపతి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పాకాల మండలం తోటపల్లి వద్ద కంటైనర్‌ను కారు ఢీ కొన్న ఘటనలో కారులో ప్ర‌యాణిస్తున్న‌ వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోగా మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు రుయా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా సాయం అందించాలని స్ప‌ష్టం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source