Logo
Download our app
మే 01 నుండి వీఐపీ బ్రేకు దర్శనాల్లో మార్పు
NEWS   Apr 28,2025 06:28 am
టీటీడీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వేస‌వి సెలవుల రద్దీ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపి లకు మాత్రమే మే 01 నుండి జూలై 15 వరకు బ్రేక్ దర్శనాలు పరిమితం చేసిన‌ట్లు స్ప‌ష్టం చేసింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం టిటిడి మే 01 తారీకు నుండి పలు కీలక నిర్ణయాలు అమలు చేయనుంది. సెలవుల నేపథ్యంలో ఇప్పటికే తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించడంలో భాగంగావీఐపీ బ్రేక్ దర్శనాలు కేవలం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే టీటీడీ పరిమితం చేయనుంది. ప్రయోగాత్మకంగా ఉదయం 6 గంటల నుండి అమలు చేయనుంది.
⚠️ You are not allowed to copy content or view source