Logo
Download our app
కాంగ్రెస్ ప్ర‌భుత్వం తెలంగాణ ఆగ‌మాగం
NEWS   Apr 27,2025 07:38 pm
ఎల్క‌తుర్తిలో జ‌రిగిన బీఆర్ఎస్ ర‌జతోత్స‌వ స‌భకు జ‌నం పోటెత్తారు. గులాబీయం అయ్యింది. ల‌క్ష‌లాదిగా జ‌నం త‌ర‌లి వ‌చ్చారు. అశేష జ‌న‌వాహినిని ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు , మాజీ సీఎం కేసీఆర్ ప్ర‌సంగించారు. ప్ర‌తి ఏడాది రూ. 15 వేల కోట్ల ఆదాయం తీసుకు వ‌చ్చామ‌ని, కానీ ఇవాళ ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీలు ఇచ్చి జ‌నాన్ని కాంగ్రెస్ స‌ర్కార్ మోసం చేసింద‌న్నారు. పాల‌న చేత‌న‌కాక ద‌ద్ద‌మ్మ‌లు తిట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారంటూ మండిప‌డ్డారు. బాధ్య‌త క‌లిగిన ప‌ద‌విలో ఉన్న వారు త‌మ‌కు అప్పులు పుట్ట‌డం లేదంటూ చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. గ‌త 10 ఏళ్ల కాలంలో దేశంలో ఎక్క‌డా లేని రీతిలో తెలంగాణ‌ను అన్ని రంగాల‌లో అభివృద్దిలోకి తీసుకు వ‌చ్చిన ఘ‌న‌త త‌న‌దేన‌ని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source