Logo
Download our app
తెలంగాణ ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శిగా రామ‌కృష్ణారావు
NEWS   Apr 27,2025 06:40 pm
రాష్ట్ర ప్ర‌భుత్వం నూత‌న ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా సీఎస్ రామ‌కృష్ణా రావును నియ‌మించింది. ఆదివారం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. సుదీర్ఘ‌మైన అనుభ‌వం కార‌ణంగా త‌న‌ను సిఫార‌సు చేసిన‌ట్లు తెలిపింది. గ‌త బీఆర్ఎస్ కేసీఆర్ ప్ర‌భుత్వ హ‌యాంలో కూడా ఆయ‌న ప‌ని చేశారు. త‌న‌పై పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు ఉన్నాయి. రామ‌కృష్ణా రావు కంటే సీనియ‌ర్ ఐఏఎస్ లు చాలా మంది ఉన్నా వారంద‌రినీ ప‌క్క‌న పెట్టిన త‌న‌కే ప్ర‌యారిటీ ఇచ్చిన‌ట్లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు సీఎస్ గా ఉన్న శాంతి కుమారి ఈనెలాఖ‌రున రిటైర్ కానున్నారు. త‌ను రాష్ట్ర స‌మాచార క‌మిష‌న‌ర్ ప‌ద‌విని ఆశించారు. చివ‌రి దాకా ప్ర‌య‌త్నం చేశారు. కానీ హైద‌రాబాద్ యూనివ‌ర్శిటీ భూముల విష‌యంలో సుప్రీంకోర్టు సీరియ‌స్ అయ్యింది. త‌న‌ను జైలుకు పంపిస్తానంటూ వార్నింగ్ ఇచ్చింది.
⚠️ You are not allowed to copy content or view source