Logo
Download our app
భారీ స్కోరు చేసిన ముంబై ఇండియన్స్
NEWS   Apr 27,2025 12:25 pm
ముంబై వాంఖ‌డే స్టేడియంలో జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 215 ర‌న్స్ చేసింది. ఓపెన‌ర్ రియాన్ రికెల్ట‌న్ 58 ప‌రుగుల‌తో దుమ్ము రేపితే స్టార్ బ్యాట‌ర్ సూర్య కుమార్ యాద‌వ్ త‌న‌దైన శైలిలో దంచి కొట్టాడు. త‌ను 54 ర‌న్స్ చేశాడు. క‌ళ్లు చెదిరే షాట్స్ తో అల‌రించాడు. ల‌క్నో బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు ఈ ఇద్ద‌రు బ్యాట‌ర్లు. ఆఖ‌రులో వ‌చ్చిన న‌మ‌న్ ధిర్ 25 ర‌న్స్ చేయ‌గా కార్బిస్ బాస్చ్ 20 ప‌రుగులు సాధించారు. టాస్ గెలిచిన ల‌క్నో స్కిప్ప‌ర్ పంత్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
⚠️ You are not allowed to copy content or view source