భద్రతకు ఒక నోడల్ ఏజెన్సీ అవసరం
NEWS Apr 27,2025 08:14 am
ప్రజల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. నివారణకు విద్యుత్, ఫైర్, ఇండస్ట్రీ ఇలా ఎవరికి వారు కాకుండా..ఇందుకు ఉద్దేశించిన వ్యవస్థలన్నీ ఒక ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్ వినియోగంలో ఉన్న లోపాలవల్లే ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరుగుతున్న వేళ.. తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు.. అందరిలో అవగాహన పెంచడం అవసరం ఉందన్నారు. భద్రతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారో లేదో పరిశీలించడానికి సంబంధిత విభాగాలకు చెందిన నిపుణుల బృందంతో ఒక నోడల్ ఏజెన్సీని రూపొందించాలని అభిప్రాయపడ్డారు.