Logo
Download our app
మీడియాకు స్వీయ నియంత్ర‌ణ అవ‌స‌రం
NEWS   Apr 27,2025 08:05 am
కేంద్ర హొం మంత్రి అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మీడియాకు స్వీయ నియంత్ర‌ణ అనేది అవ‌స‌ర‌మ‌న్నారు. భారత పాకిస్థాన్ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయ‌ని, సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దిగుతోందన్నారు. భారత్ సైన్యం అందుకు తగ్గట్టుగానే దీటుగా బదులిస్తోందన్నారు. ఈ క్రమంలో దేశంలో మీడియాకు, సోషల్ మీడియా యూజర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేస్తున్న‌ట్లు తెలిపారు. మీడియా కవరేజ్ విషయంలో పలు సూచనలు చేశారు. అదే టైంలో సోషల్ మిడియా యూజర్లు, ఇన్ఫ్లూయెన్సర్లకు కూడా ఇవి వర్తిస్తాయని తెలిపారు. పాకిస్థాన్ కవ్వింపు చర్యలు దిగుతున్న వేళ రక్షణపరంగా ప్రభుత్వం కీలకమైన చర్యలు తీసుకుంటోంద‌ని పేర్కొన్నారు.. మీడియా కవరేజ్ విషయంలో అత్యుత్సాహం చూపించొద్దని హితవు పలికారు. రక్షణ చర్యలను లైవ్ కవరేజ్ చేయొద్దని సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source