తిరుమలలో భద్రతా దళాల మాక్ డ్రిల్
NEWS Apr 27,2025 07:55 am
తిరుమల పుణ్య క్షేత్రానికి నిత్యం వేలాది మంది భక్త బాంధవులు వస్తుంటారు. పెద్ద ఎత్తున వచ్చే వారి భద్రత విషయంలో టీటీడీ భద్రతా విభాగం నిత్యం పర్యవేక్షణ చేస్తుంటుంది. అలిపిరి ఘటన తర్వాత సెక్యూరిటీని మరింత పెంచింది. తాజాగా కాశ్మీర్ లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రదాడి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా తిరుమలలో ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను లేపాక్షి సర్కిల్ వద్ద ఉన్న సుదర్శన్ సత్రంలో భద్రతా దళాల మాక్ డ్రిల్ ద్వారా నిర్వహించారు.