ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం
NEWS Apr 27,2025 07:50 am
హైదరాబాద్ కు చెందిన అపర్ణ ఎంటర్ ప్రైజస్ లిమిటెడ్ (వెటిరో టైల్స్) సంస్థ భారీ విరాళాన్ని తిరుమల స్వామి వారికి అందజేసింది. శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించింది. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు ఆ సంస్థ ప్రతినిధి బి.రమేష్ విరాళం డీడీని అందజేశారు. ఈ సందర్బంగా దాతలను ప్రత్యేకంగా అభినందించారు చైర్మన్.