కల్తీ నెయ్యి ఘటనపై సిట్ విచారణ
NEWS Apr 27,2025 07:29 am
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల కల్తీ నెయ్యి ఘటనపై ఏపీ సిట్ దూకుడు పెంచింది. నెల్లూరు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇద్దరిని కస్టడీకి తీసుకుంది. హరిద్వార్ లోని బోలెబాబ మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ A 12 గా ఉన్న హరి మోహన్, రాజస్థాన్ లోని బికనీర్ కు చెందిన ఏ15గా ఉన్న ఆశిష్ అగర్వాల్ లను అదుపులోకి తీసుకుంది విచారణ నిమిత్తం. కోర్టు విచారించేందుకు ఈ ఇద్దరికి 5 రోజుల కస్టడీకి ఇచ్చింది. ఈనెల 28 వరకు విచారణ కొనసాగుతుందని తెలిపారు సిట్ అధికారులు. ఇదే కేసుకు సంబంధించి ఆరుగురిని అరెస్ట్ చేసింది.