నల్ల బ్యాడ్జీలతో శాంతియుత నిరసన
NEWS Apr 26,2025 06:55 pm
జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడి ఘటనను నిరసిస్తూ మెట్ పల్లి లోని మదీనా మసీదు వద్ద బర్కత్ పుర యూత్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్ద ముఫ్తీ అబూ బకర్ మాట్లాడారు. జమ్మూ కశ్మీర్ లో జరిగిన ఘటన దారుణమన్నారు. అత్యంత అమానవీయ ఘటన అని పేర్కొన్నారు. బర్కత్ పుర యూత్ అధ్యక్షులు ఖాజా అజీమ్, సీనియర్లు మహ్మద్ రయీస్, మహ్మద్ తమీజ్, యూత్ సభ్యులు పాల్గొన్నారు.