కేసీఆరే సీఎం కేటీఆర్ కు నో ఛాన్స్
NEWS Apr 26,2025 12:06 pm
మాజీ మంత్రి హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తె కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని, కేటీఆర్ ఇప్పట్లో సీఎం అయ్యే ఛాన్స్ లేదన్నారు. కవిత, కేటీఆర్ ల మధ్య ఎలాంటి కోల్డ్ వార్ లేదని, అదంతా సోషల్ మీడియా సృష్టేనంటూ ఆరోపించారు. తాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ లైన్ దాటే ప్రసక్తి లేదన్నారు. అయితే ఎంపీ ఎన్నికల్లో వైఫల్యం, కేసీఆర్ అసెంబ్లీకి రాక పోవడం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయక పోవడం పై ఆయన సమాధానం చెప్పకుండా దాట వేశారు.