Logo
Download our app
తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ
NEWS   Apr 26,2025 09:07 am
తిరుమ‌ల పుణ్య క్షేత్రం భ‌క్త బాంధ‌వుల‌తో కొన‌సాగుతోంది. శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను 64 వేల 536 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 30 వేల 612 మంది త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.37 కోట్లు వ‌చ్చిన‌ట్లు ఈవో జె. శ్యామ‌ల రావు వెల్లడించారు. స్వామి వారి ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు 26 కంపార్టుమెంట్ల‌లో వేచి ఉన్నార‌ని, ఎలాంటి టోకెన్లు లేని భ‌క్తుల‌కు 12 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source