Logo
Download our app
ఏపీలో రేప‌టిక‌ల్లా పాకిస్తాన్ పౌరులు వెళ్లిపోవాలి
NEWS   Apr 26,2025 08:16 am
పాకిస్తాన్ పౌరులకు వీసా సర్వీసులను సస్పెండ్ చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలిక వీసాలు, దౌత్య మరియు అధికారిక వీసాలకు ఈ నిబంధనలు వర్తించవని తెలిపింది. పాకిస్తాన్ పౌరులు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా గుర్తించి, వారందరినీ వారి, వారి దేశానికి తిరిగి పంపించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు ఏపీ డీజీపీ హ‌రీష్ కుమార్ గుప్తా. భారత హోం మంత్రిత్వశాఖ జారీచేసిన నియమ, నిబంధనలకు వ్యతిరేకంగా నిర్దేశించిన కాలపరిమితి దాటి రాష్ట్రంలో అక్రమంగా ఉండే పాకిస్తాన్ జాతీయులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
⚠️ You are not allowed to copy content or view source