Logo
Download our app
కారు బాంబు దాడిలో ర‌ష్య‌న్ జ‌న‌ర‌ల్ దుర్మ‌ర‌ణం
NEWS   Apr 25,2025 06:00 pm
రష్యా జ‌న‌ర‌ల్ యూరోస్లావ్ మోస్కాలిక్ దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. మాస్కోలో ఉక్రెయిన్ నిఘా సంస్థ‌లు అమ‌ర్చిన కారు బాంబు ఘ‌ట‌న‌లో దుర్మ‌ర‌ణం చెందాడు. ఈ ఘ‌ట‌న‌లో ఒక్క‌సారిగా ర‌ష్యా ఉలిక్కి ప‌డింది. ఇది లక్ష్యంగా చేసుకున్న దాడి అని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. మాస్కోకు తూర్పున ఉన్న బాలాషిఖా పట్టణంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌ను మృతి చెందిన‌ట్లు ర‌ష్యా ద‌ర్యాప్తు క‌మిటీ ధ్రువీక‌రించింది. ఈ శక్తివంతమైన పేలుడును క్రిమినల్ కేసుగా పరిగణిస్తున్నారు.రష్యన్ సైనిక నాయకత్వంలో కీలక స్థానం అయిన రష్యన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ ప్రధాన ఆపరేషన్ డైరెక్టరేట్ డిప్యూటీ హెడ్‌గా మోస్కాలిక్ ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source