హైదరాబాద్ లో ముస్లింల శాంతి ర్యాలీ
NEWS Apr 25,2025 04:23 pm
పాకిస్తాన్ కు వ్యతిరేకంగా భారత దేశంకు మద్దతుగా పెద్ద ఎత్తున ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గామ్ లో ఉగ్రవాదులు 26 మందిని హతమార్చడంపై నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. ఓల్డ్ సిటీలో నమాజ్ కు హాజరయ్యారు. అనంతరం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇండియా జిందాబాద్ పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ మండిపడ్డారు. మేమంతా భారతీయులమని, ఉగ్రవాదానికి తాము వ్యతిరేకమన్నారు.