వైసీపీ నేతలకు ఎంపీ కేశినేని చిన్ని వార్నింగ్
NEWS Apr 25,2025 01:11 pm
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని నిప్పులు చెరిగారు. వైసీపీ నేతల బండారం త్వరలోనే బయట పడుతుందన్నారు. మాజీ మంత్రి రోజా, ఇతర వైసీపీ నేతల అవినీతిని బయటకు తీస్తామన్నారు. వైసీపీ బ్యాచ్ అంతా డ్రామాలు ఆడుతున్నారంటూ ఆరోపించారు. రాజకీయంగా ఏదైనా చేయాలనుకుంటే తనతో ఢీకోవాలని అన్నారు. అంతే కానీ పెట్టుబడిదారులను భయపెట్టి తనపై బురద చల్లాలని చూస్తే మాత్రం ఊరుకోనంటూ వార్నింగ్ ఇచ్చారు చిన్ని.