పరువు నష్టం కేసులో మేధా పాట్కర్ అరెస్ట్
NEWS Apr 25,2025 01:01 pm
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా దాఖలు చేసిన పరువు నష్టం కేసులో సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. శుక్రవారం అరెస్ట్ చేశారు. శనివారం కోర్టులో హాజరు పర్చనున్నారు. ఎల్జీ కేసులో కోర్టుకు హాజరు కాక పోవడం, శిక్షా ఉత్తర్వులను పాటించక పోవడం పట్ల కోర్టు సీరియస్ అయ్యింది. 2001లో తనపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు లెఫ్టినెంట్ గవర్నర్. ప్రొబేషన్ బాండ్లు, లక్ష రూపాయల జరిమానాను సమర్పించాలన్న శిక్షా ఉత్తర్వులను పాట్కార్ ఉద్దేశ పూర్వకంగానే ఉల్లంఘిస్తోందంటూ మండిపడింది.