పోప్ అంత్యక్రియలకు రాష్ట్రపతి ముర్ము
NEWS Apr 25,2025 08:47 am
వాటికన్ సిటీకి చేరుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇవాళ, రేపు ఆమె అక్కడే ఉంటారు. ప్రసిద్ద పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు ఆమె హాజరవుతారు. ఈ సందర్బంగా భారత ప్రభుత్వం, ప్రజల తరపున సంతాపాన్ని తెలియ చేస్తారు. ఈనెల 26న పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన అధినేతలు, పీఎంలు, ప్రెసిడెంట్లు హాజరు కానున్నారు.