Logo
Download our app
నిఘా వ్య‌వ‌స్థ‌ల వైఫ‌ల్యం దాడికి కార‌ణం
NEWS   Apr 25,2025 08:33 am
ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల నిప్పులు చెరిగారు. ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ఏకి పారేశారు. ఇండియా నిఘా వ్య‌వ‌స్థ పూర్తిగా వైఫ‌ల్యం చెందడం వ‌ల్ల‌నే ఉగ్ర‌దాడి ఘ‌ట‌న చోటు చేసుకుంద‌న్నారు. దీనికి పూర్తిగా పీఎం బాధ్య‌త వ‌హించాల‌న్నారు. ఇండియా నిఘా వ్యవస్థలను మోడీ వ్యవస్థలుగా మార్చారంటూ ఆరోపించారు. ఇంటలిజెన్స్ అంతా మోడీ కోసం పని చేస్తోందంటూ ధ్వ‌జ‌మెత్తారు. మోడీ కి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ గొంతు నొక్కేందుకు ప‌ని చేయ‌డం వ‌ల్ల‌నే ఇలాంటి దాడులు జ‌రుగుతున్నాయ‌ని వాపోయారు. ఈ ఘ‌ట‌న‌కు పూర్తి బాధ్య‌త మోదీ, షాలేన‌ని పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source