అందరికీ ఉచితంగా ఆన్ లైన్ లో డీఎస్సీ కోచింగ్
NEWS Apr 25,2025 08:27 am
బీసీ స్టడీ సర్కిల్ ద్వారా బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు, ఎస్సీ, ఎస్టీ డీఎస్సీ అభ్యర్థులందరికీ ఆన్ లైన్ ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్ అందివ్వనున్నట్లు మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఇందుకోసం శ్యామ్ ఇన్ స్టిట్యూట్ ఆచార్య యాప్ రూపొందించామని, ఈ యాప్ ద్వారా 24 గంటల పాటు ఉచిత శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తన ఛాంబర్ లో ఆన్ లైన్ ఉచిత డీఎస్సీ కోచింగ్ ను ప్రారంభించారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటను సీఎం చంద్రబాబు నెరవేర్చారని, ఈ మేరకు 16,347 టీచర్ పోస్టుల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహణ ఫైల్ పై మొదట సంతకం చేశారన్నారు.