ఉగ్రవాదంపై దేశ ప్రజలు గళం విప్పాలి
NEWS Apr 25,2025 08:20 am
పెహల్గామ్ దాడి ఘటనపై స్పందించారు పవన్ కళ్యాణ్. ఈ దాడిలో మృతి చెందిన చంద్రమౌళి కుటుంబాన్ని పరామర్శించారు. తనను ఎంతో బాధకు గురి చేసిందన్నారు. దేశ ప్రజలంతా ఒకే తాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. హిందువా కాదా అని కాల్చి చంపడం అనైతికమన్నారు. బాధిత కుటుంబాలను పరామర్శిస్తుంటే తనకు మాటలు రాలేదన్నారు. ఉగ్రవాదులను ఏరి పారేసేందుకు మోదీ కంకణం కట్టుకున్నారని చెప్పారు .