బెంగళూరు భళా రాజస్థాన్ విలవిల
NEWS Apr 25,2025 07:58 am
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో వరుస పరాజయాలకు స్వస్తి పలికింది హోం గ్రౌండ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆ జట్టు బౌలర్ల దెబ్బకు ప్రత్యర్థి రాజస్థాన్ రాయల్స్ తలవంచక తప్పలేదు. నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 11 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ సూపర్ షో చేశారు. బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నారు. రాజస్థాన్ బౌలర్లను ఉతికి ఆరేశారు. 9 వికెట్లు కోల్పోయి 194 పరుగులకే పరిమితమైంది. జైశ్వాల్ 19 బాల్స్ ఎదుర్కొని 7 ఫోర్లు 3 సిక్సర్లతో 49 రన్స్ చేశాడు. జురెల్ 3 ఫోర్లు 3 సిక్సర్లతో 47 రన్స్ చేశాడు. విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. 70 పరుగులతో రెచ్చి పోయాడు.