సీనియర్ ఐఏఎస్ లపై హైకోర్టు సీరియస్
NEWS Apr 25,2025 07:30 am
భూదాన్ భూములపై సీరియస్ కామెంట్స్ చేసింది హైకోర్టు. సీబీఐ, ఈడీ విచారణ చేస్తేగాని వాస్తవాలు బయటికి వచ్చేలా లేవని వ్యాఖ్యానించింది. విచారణ నిర్వహించగలరో లేదో చెప్పాలని సీబీఐని ఆదేశించింది. నవీన్‌మిట్టల్, మహేశ్ భగవత్, డాక్టర్ జ్ఞానముద్ర వంటి 26 మంది కీలక ప్రభుత్వ అధికారులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. 50 ఏళ్లకుపైగా సాగు చేసుకుంటున్న భూమిని కొందరు అధికారులు కబ్జా చేయాలని చూస్తున్నారని బిర్లా మహేశ్ పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టింది.