పాకిస్తాన్ గగనతలం మూసివేత
NEWS Apr 24,2025 06:34 pm
భారత్ పై ప్రతీకార చర్యలకు దిగింది పాకిస్తాన్. సింధు జలాల ఒప్పందాన్ని , సిమ్లా ఒప్పందంతో సహా అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. నీటిని మళ్లించడం యుద్ధ చర్యగా పరిగణించబడుతుందని పాక్ హెచ్చరించింది. మూడవ దేశాల ద్వారా పరోక్ష వాణిజ్యం సహా , వాణిజ్యం నిలిపి వేయబడిందని పేర్కొంది. భారత సైనిక అటాచ్‌లు, దౌత్యవేత్తలను పర్సనా నాన్ గ్రాటాగా ప్రకటించారు. ఇస్లామాబాద్‌లో భారత దౌత్య సిబ్బంది సంఖ్య 30కి పరిమితం చేయబడింది. పాకిస్తాన్ గగనతలం భారత విమానాలకు మూసి వేస్తున్నట్లు ప్రకటించింది. అన్ని భారతీయ రవాణా కోసం వాఘా సరిహద్దును సీజ్ చేశారు.