టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ కు బెదిరింపులు
NEWS Apr 24,2025 06:32 pm
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. నిన్న జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గామ్ లో ఘటన చోటు చేసుకున్న అనంతరం గంభీర్ ను ఉద్దేశించి బెదిరింపు కాల్స్ రావడం ఒకింత కలకలం రేపింది. ఈ విషయం గురించి స్వయంగా హెడ్ కోచ్ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించాడు. తనకు వచ్చిన కాల్స్ గురించి వివరాలు అందజేశారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.