Logo
Download our app
కాశ్మీర్ లో చిక్కుకున్న ప‌ర్యాట‌కుల కోసం హెల్ప్ లైన్
NEWS   Apr 24,2025 05:54 pm
తెలంగాణ పర్యాటకుల కోసం‌ హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు. వారిని స్వ‌స్థ‌లాల‌కు ర‌ప్పించేందుకు చ‌ర్య‌లు చేపడుతున్నామన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు, కేంద్ర ఏజెన్సీ లతో ప్రభుత్వం సమన్వయం చేసుకుంటోంద‌న్నారు. జమ్ము, కాశ్మీర్ లోప్రయాణించిన పర్యాటకుల వివరాలు వెంటనే అందించాల‌ని అన్ని టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లను కోరామ‌న్నారు. 9440816071, 9010659333, 040 - 23450368 హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేసి సహాయం తీసుకోవాలని సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source