పాక్ హై కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
NEWS Apr 24,2025 06:31 pm
ఢిల్లీలోని పాక్ హై కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పహల్గామ్ దాడి ఘటనను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. దీని వెనుక పాకిస్తాన్ కుట్ర దాగి ఉందంటూ ఆరోపించారు. ఇదిలా ఉండగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాకిస్తానీయులకు భారత్ లోకి అనుమతించ బోమంటూ ప్రకటించింది. పాక్ పర్యాటకులు, పౌరులు 48 గంటల్లో తమ దేశాన్ని విడిచి వెళ్లాలని ఆదేశించింది. పాక్ హై కమిషన్ కూడా వెళ్లి పోవాలంటూ పేర్కొంది.