పీవోకేలో 42 ఉగ్రవాద శిబిరాల గుర్తింపు
NEWS Apr 24,2025 06:31 pm
పహల్గామ్ లో ఉగ్రవాద ఘటన జరిగిన అనంతరం కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మరో వైపు ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లనే ఈ దారుణం చోటు చేసుకుందని ఎంఐఎం ఎంపీ ఓవైసీ ఆరోపించారు. తాజాగా భారత భద్రతా దళాలు జమ్మూ కాశ్మీర్ ను జల్లెడ పడుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. తాజాగా 42 ఉగ్రవాద శిబిరాలు ఉన్నట్లు గుర్తించింది. పీవోకేలోని బహుళ లాంచ్ ప్యాడ్ లు ఉన్నాయని తెలిపింది. అవసరమైతే వాటిని ధ్వంసం చేస్తారని సమాచారం. అమర్‌నాథ్ యాత్రకు ముందు భద్రతను మరింత పెంచనుంది కేంద్రం.