బౌల్ట్ దెబ్బ కాటేరమ్మ కొడుకులు అబ్బా
NEWS Apr 24,2025 05:54 pm
ఉప్పల్ వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో చేతులెత్తేసింది పాట్ కమిన్స్ సారథ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్. ప్లే ఆఫ్ ఆశలపై నీళ్లు చల్లింది ముంబై ఇండియన్స్. గత సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక పాత్ర పోషించిన ట్రెంట్ బౌల్ట్ ను ఆ జట్టు యాజమాన్యం వేలం పాటలో పోగొట్టుకుంది. ఇప్పుడు చింతిస్తోంది. ఆ జట్టు నుంచి ముగ్గురు కీలక ఆటగాళ్లు ఇతర జట్లకు మారారు. వారిలో బౌల్ట్, జోస్ బట్లర్, యుజ్వేంద్ర చాహల్ . తాజాగా జరిగిన కీలక పోరులో 4 ఓవర్లలో కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. జట్టు పతనాన్ని శాసించాడు. ప్రస్తుతం బౌల్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు.