పాకిస్తాన్ పౌరులకు నో ఎంట్రీ
NEWS Apr 24,2025 06:31 pm
కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ కు షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ పౌరులకు భారత దేశంలో ప్రవేశం లేదని స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్ లో జరిగిన ఉగ్ర దాడిని భారత్ అత్యంత తీవ్రంగా పరిగణించింది. పహల్గాం దాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన భద్రతపై కేబినెట్ కమిటీ (CCS) భేటీలో పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఉగ్ర దాడి వెనుక పాక్ హస్తం ఉందని పేర్కొంది కేంద్రం. పాకిస్థాన్ పర్యాటకులతో పాటు ప్రత్యేక వీసాదారులు 48 గంటల్లో భారత్ ను వీడాలని ఆదేశించింది.