ఫాక్స్ కాన్ వైస్ ప్రెసిడెంట్ గా సంజయ్
NEWS Apr 24,2025 05:54 pm
టీ ఫైబర్ గ్రిడ్ సీఈఓగా గతంలో పని చేసిన సంజయ్ కారంపురి అత్యున్నతమైన సంస్థ ఫాక్స్ కాన్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ గా ఎంపికయ్యాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఆయనను ఏరికోరి అప్పటి బీఆర్ఎస్ సర్కార్ టీ వర్క్ , టీ ఫైబర్ గ్రిడ్ కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమించింది. ఆయన ఆధ్వర్యంలో టీ వర్క్ పలు కీలక పనులకు శ్రీకారం చుట్టింది. గులాబీ సర్కార్ పతనం కావడం కాంగ్రెస్ సర్కార్ పవర్ లోకి రావడంతో వచ్చీ రావడంతోనే కీలక పదవుల్లో ఉన్న వారిని తొలగించింది. మొత్తంగా ఇక్కడ తొలగించినా అత్యున్నతమైన పదవి దక్కడం విశేషం.