Logo
Download our app
తెలంగాణ‌లో వ‌డదెబ్బ‌కు విల‌విల
NEWS   Apr 24,2025 05:54 pm
తెలంగాణ‌లో రోజు రోజుకు ఎండ వేడిమి పెరుగుతోంది. నిర్మ‌ల్ జిల్లాలో అత్య‌ధికంగా 45.2 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోదైంది. ఎండ వేడిమి దెబ్బ‌కు 11 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన‌ట్లు స‌మాచారం. ఖమ్మం జిల్లాలో ముగ్గురు, పెద్దపల్లి జిల్లాలో ఒకరు, ఆసిఫాబాద్ జిల్లాలో ఒక్కరు, సూర్యాపేట జిల్లాలో ఒక్కరు, నిర్మల్ జిల్లాలో ఒక్కరు, కరీంనగర్ జిల్లాలో ఒక్కరు, వరంగల్ జిల్లాలో ఒక్కరు, జనగామ జిల్లాలో ఒక్కరు, ములుగు జిల్లాలో ఒక్కరు ఎండ తీవ్రతను తట్టుకోలేక మృత్యువాత ప‌డ్డారు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది.
⚠️ You are not allowed to copy content or view source