బెట్టింగ్ యాప్స్ కేసులు సీఐడీకి బదిలీ
NEWS Apr 24,2025 05:54 pm
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెట్టింగ్ యాప్స్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 25 మంది సెలబ్రిటీలపై పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో నమోదైన బెట్టింగ్ యాప్స్ కేసులను సీఐడీకి బదిలీ చేయనున్నట్లు స్పష్టం చేసింది.