హైదరాబాద్ పరాజయం పరిసమాప్తం
NEWS Apr 24,2025 05:54 pm
ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో భాగంగా చావో రేవో తేల్చుకోవాల్సిన సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతులెత్తేసింది. ముంబై ఇండియన్స్ చేతిలో ఘోర ఓటమి చవి చూసింది. ఎస్ ఆర్ హెచ్ ఆట తీరులో ఎలాంటి మార్పు లేదు. పాయింట్ల పట్టికలో అట్టడుగన చేరింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన ఈ మ్యాచ్ లో ఎలాంటి పోరాటం చేయకుండానే పరాజయం పాలైంది. హార్దిక్ పాండ్యా సేనకు ఇది ఐదో విజయం కావడం విశేషం. 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. క్లాసెన్ ఒక్కడే క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడాడు. 9 ఫోర్లు 2 సిక్స్ లతో 71 రన్స్ చేశాడు. అభినవ్ మనోహర్ 43 పరుగులతో రాణించడంతో 8 వికెట్లు కోల్పోయి 143 రన్స్ చేసింది. 144 పరుగులను 3 వికెట్లు కోల్పోయి ముంబై ఛేదించింది.