శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.62 కోట్లు
NEWS Apr 24,2025 06:31 pm
తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 68 వేల 705 మంది భక్తులు దర్శించుకున్నారు. 25 వేల 382 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.62 కోట్లు వచ్చినట్లు ఈవో జె. శ్యామల రావు వెల్లడించారు. స్వామి వారి దర్శనం కోసం ప్రస్తుతం 9 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, టోకెన్లు లేని సర్వ దర్శనం కోసం 12 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.